Rana Naidu : విక్టరీ వెంకటేష్, రానా లు ప్రధాన పాత్రలో నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు కాగా, మొదటి నుండి ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీగానే ఉండేవి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ ఇందులో నటించే సరికి కుటుంబ సమేతంగా చూడొచ్చని అందరు అనుకున్నారు. కాని ఈ సిరీస్ లో పరిమితికి మించి బూతులు ఉండటం.. సెక్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో.. వెంకటేష్, రానాలు తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నారు.
ఈ ఎఫెక్ట్ అంతకంతకూ పెరుగుతూ.. ఓటీటీ కంటెంట్ పై కోర్టుల్లో కేసులు వేయడటంతో నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తాజాగా తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉండగా, అందులో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతుంది. ఈ సిరీస్ లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా 12 కోట్ల పారితోషికం , రానా 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
also read :
Sarath Babu : ఆసుపత్రిలో శరత్ బాబుకి చికిత్స.. ఏం జరిగింది..!