Ramiz raja :పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి రమీజ్ రజాను ఆ దేశ ప్రభుత్వం తప్పించిన విషయం తెలిసిందే. ఇటీవలే పాక్ ఇంగ్లాండ్ చేతిలో 3-0తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో అతనిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, రమీజ్ రాజా స్థానంలో నజమ్ సేథీ అధ్యక్షుడిగా 14 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు నెలలు పాటు సేథీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. రమీజ్ రజా 15 నెలలుగా పీసీబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో రమీజ్ రజాను ఛైర్మన్గా నియమించింది.
అయితే రమీజ్ రాజా అధికారంలో ఉండగా, రూ.1.65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బులెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశాడని వార్తలు వచ్చాయి. ఇలా రజా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి.వీటికి వివరణ ఇచ్చిన రమీజ్ రాజా.. పాతికేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఆ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో పాక్ ఓడిపోయింది. ఈ సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయని, కొందరు తనను చంపేస్తామని హెచ్చరికలు చేశారని రమీజ్ రజా చెప్పుకొచ్చాడు.. ‘దీనికి సంబంధించిన అన్ని వివరాలు నేను చెప్పకూడదు. కానీ ఇది జరిగినప్పుడు డీఐజీని కూడా కలిశాం. వాళ్ల సలహాతోనే బులెట్ ప్రూఫ్ కారు కొన్నా’ అని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఆ కారు తన వద్ద లేదని, అది పీసీబీ దగ్గరే ఉందని కూడా రమీజ్ తెలిపాడు. ఆ కారు పీసీబీదే అని, తన తర్వాత వచ్చే చీఫ్ కూడా అది వాడుకోవచ్చునని చెప్పుకొచ్చాడు. అయితే రమీజ్ రాజాపై పాక్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.రమీజ్ రజా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పాకిస్తాన్ జూనియర్ లీగ్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ సారధి షాహిద్ అఫ్రిదీని చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. కాగా, ఇటీవల పాకిస్తాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరచడం కూడా రమీజ్‌కి చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పాలి.