Telugu Flash News

గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్, డైరెక్టర్ శంకర్‌పై ఆగ్రహం

ram charan game changer poster

రామ్ చరణ్ అభిమానులు డైరెక్టర్ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

గతేడాది డిసెంబర్‌లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి ప్రకటిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటికీ ఎలాంటి అప్డేట్స్ లేవు.

రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ #WakeUpShankarLucha ను ట్రెండ్ చేస్తున్నారు. శంకర్ నిద్రపోతున్నాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దేశంలో ఎన్నికల సంస్కరణల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Exit mobile version