Ramaphalam benefits : సీతాఫలం గురించి అందరికీ తెలిసిందే. రామఫలం గురించి కొందరికే తెలుసు. అరుదైన ఈ పండులో పోషక విలువలు ఎక్కువ. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రొటీన్లు, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
సీతాఫలం తీపి పండు అయితే, రామఫలం తక్కువ తీపిగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును స్వేచ్ఛగా తినవచ్చు.
ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. రామాఫలంలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ముఖంపై మొటిమలను నివారిస్తుంది.
ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ పండు అందించే మంచి కొవ్వు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఇందులోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది. చర్మ కాంతిని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దీంతో చుండ్రు సమస్య దూరమవుతుంది.
అంతేకాదు సహజసిద్ధమైన యాంటీబయాటిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన రామాఫలం విరేచనాలను నియంత్రిస్తుంది.
ఇది న్యుమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.
పెళుసు ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు తొలగిపోతాయి. చర్మం నల్లగా మారే హైపర్పిగ్మెంటేషన్ సమస్యకు రామఫలం అద్భుత నివారణగా పనిచేస్తుంది.
దీని గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే నలుపు పోతుంది. రమాఫలాన్ని తినడమే కాకుండా దాని గుజ్జును హెయిర్ ప్యాక్‌గా వేసుకోవచ్చు.
ఈ పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది మరియు జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
దురదను తగ్గించడంలో, చర్మ సంరక్షణలో, మొటిమల మచ్చలను నియంత్రించడంలో రామఫలం ఔషధంగా పనిచేస్తుంది.
ఈ అరుదైన పండు దొరికితే మిస్ కాకుండా చూడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
also read :
Mental Health : మానసిక ఆరోగ్యానికి కూడా డైట్ .. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Heart Attack : పురుషుల కంటే స్త్రీలు గుండెపోటుకు గురవుతున్నారా? ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?