Rama Prabha: రమాప్రభ.. ఈ పేరు నేటి కాలం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని పాత తరం వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా తన నటనతో అలరించింది. పద్నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన రమాప్రభ..తెలుగు, తమిళ , హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా నటించి.. అందర్ని మెప్పించింది.
బామ్మగా, అమ్మ, అక్క, వదిన ఇలా అనేక పాత్రలో నటించి..తమ ఇంటి మనిషి అనేంతల గుర్తింపు సంపాదించుకుంది. అయితే వయోభారం వలన కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆమెపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రమాప్రభ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అడుక్కు తినే పరిస్థితి వచ్చిందంటూ కొందరు వార్తలు రాశారు.దీనిపై రమాప్రభ స్పందించారు.
నా సొంత యూట్యూబ్ ఛానల్ అయిన ‘రమాప్రభ ప్రయాణం’ లో నా ఇంటిని చూపించాను. నిజంగా నేను అడుక్కు తినే పరిస్థితిలో ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నా యూట్యూబ్ వీడియోల కోసం నేను బిజీగా పని చేస్తున్నాను.
అలాంటిది ఏ గ్యాప్ లో నేను అడుక్కున్నాను? పూరీ, నాగార్జున, మరికొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరి కంటే నేను చాలా ధనవంతురాలిగా ఉన్నాను” అని రమాప్రభ చెప్పుకొచ్చారు.
also read:
Viral video : న్యూజిలాండ్‌లో వరద నీటిలోనూ బస్సు వేగం. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
రావి ఆకులతో ఈ రోగాలు దూరం.. ప్రయోజనాలివే..