ఏపీ (Andhra Pradesh) లో యువ నేతల జోష్ పెరిగింది. ఓవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడు దూసుకెళ్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు.. తనదైన ప్రసంగాలు, కార్యక్రమాలతో ప్రజల్లో పేరు సంపాదించుకుంటున్నారు. అనతికాలంలోనే శ్రీకాకుళం టీడీపీ ఎంపీగా ఎన్నికై సంచలనం సృష్టించారు రామ్మోహన్ నాయుడు.
లోక్‌సభలోనూ రామ్మోహన్ నాయుడు ప్రసంగంపై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసేంతగా ఆయన ఎదిగారు. అధికార పార్టీపై నిర్మాణాత్మకంగా ఆయన చేసే విమర్శలు కీలకంగా మారాయి. వైసీపీ ఎంపీలు కూడా చాలా మంది మాట్లాడలేని విధంగా ఆయన గొంతెత్తి మాట్లాడతారని పేరు తెచ్చుకున్నారు. వైసీపీ ఎంపీలతో రామ్మోహన్ నాయుడిని పోల్చుతూ చాలా మంది విమర్శలు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడుకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోందట. రామ్మోహన్‌నాయుడుకు ధీటుగా నిఖార్సయిన మాటల తూటాలతో చెలరేగి ప్రసంగాలు చేసే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధినేత జగన్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఢిల్లీకి పంపాలని నిర్ణయించారా?
బహిరంగ సభల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ రాయలసీమ యాసలో అనర్గళంగా ప్రసంగాలు చేసే బైరెడ్డి.. రామ్మోహన్‌నాయుడుకు లోక్‌సభలో కౌంటర్ గట్టిగా ఇవ్వగలుగుతాడని భావిస్తున్నారు. సభ లోపల, వెలుపల కూడా విపక్షానికి ధైర్యంగా సమాధానాలు చెప్పగలిగే సత్తా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలో ఉందని చెబుతున్నారు. యువత ఓట్లు కొల్లగొట్టేందుకు కూడా వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డికి ఏపీ శాప్ చైర్మన్‌గా పదవి కట్టబెట్టిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీకి పంపాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
also read news:
Layoffs: వెంటాడుతున్న లేఆఫ్ కత్తి.. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఊడిన భారతీయుల ఉద్యోగాలు!
Pawan Kalyan: తెలంగాణలో పర్యటనలుంటాయా? వారాహి వాహన పూజల నేపథ్యంలో కొత్త చర్చ!
Viral video today : ప్రేమికుల రొమాన్స్.. మరీ పబ్లిక్‌గానా? కదులుతున్న కారులో ఏం చేశారో మీరే చూడండి!