HomecinemaRam Charan: రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది అమ్మాయేన‌ట‌.. విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది అమ్మాయేన‌ట‌.. విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

Telugu Flash News

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే మెగా అభిమానులు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని, మెగా వార‌సుడు రావాల‌ని బలంగా కోరుకుంటున్నారు.

అయితే వారి ఆశలు గల్లంతే అయిన‌ట్టు క‌నిపిస్తుంది. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. ఆ మ‌ధ్య రామ్ చరణ్ మాట్లాడుతూ… థర్డ్ జూన్ ఆన్ ‘హెర్’ వే… అంటూ కామెంట్ చేశారు. అంటే జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఫ్లోలో అనేశాడు.

ఇక ఇటీవ‌ల జరిగిన సీమంత వేడుకలో పింక్ థీమ్ లో క‌నిపించింది ఉపాస‌న‌.పింక్ కలర్ అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని కొంద‌రు గెస్ చేస్తున్నారు.

ఇక‌ మూడో హింట్ గా అల్లు అర్జున్ గిఫ్ట్ ని గురించి చెప్పుకొస్తున్నారు. సీమంత వేడుకకు హాజరైన అల్లు అర్జున్.. ఉపాస‌నతో దిగిన ఫోటో ఫేర్ చేస్తూ… సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సి అంటూ గిఫ్ట్ వ్రాప్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ ఎమోజీ త‌న పోస్ట్‌లో ఉంచాడు.

వీట‌న్నింటిని బ‌ట్టి ఉపాసనకు పుట్టబోయేది ఖచ్చితంగా అమ్మాయే అని కొంద‌రు జోస్యం చెబుతున్నారు. మ‌రి వారి జోస్యాలు ఎంత వ‌రకు నిజం అవుతాయో చూడాలి.

also read :

-Advertisement-

Photos : Celebrities at Upasana’s baby shower | ఉపాసన సీమంతం ఫోటోలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News