Telugu Flash News

Ram Charan Upasana: తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన.. మెగా ప్రిన్సెస్ వచ్చేసింది

ram charan upasana

Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంగళవారం తెల్లవారుజామున ఓ తీపి కబురు అందింది. చిరంజీవికి మనవరాలు పుట్టింది. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆస్పత్రి బులెటిన్‌ను విడుదల చేసింది.

మెగాస్టార్ ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. కాగా, రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకోగా.. గత ఏడాది డిసెంబర్ 12న ఈ జంటకు బిడ్డ పుట్టబోతున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలు కూడా గ్రాండ్‌గా జరిగాయి.

మొత్తానికి మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందిన చరణ్‌-ఉపాసనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే మెగా వారసురాలు పేరున పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు అయిన రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు.

అటు మెగా ఫ్యామిలీలోనూ, ఇటు కామినేని ఫ్యామిలీలోనూ అందరూ ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ కూతురితో చూసి సంబరపడిపోయాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. రామ్ చరణ్, ఉపాసనలను అభినందించేందుకు, అప్పుడే పుట్టిన ఆడబిడ్డను ఆశీర్వదించేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ఈరోజు ఆసుపత్రికి వస్తారని మెగా ఫ్యామిలీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది.

గత కొన్ని రోజులుగా రామ్ చరణ్, ఉపాసన వార్తలు అన్ని చోట్లా వైరల్ అవుతున్నాయి. ముందుగా ఉపాసన డెలివరీ తేదీ జూలై అని భావించారు, కానీ తరువాత అది జూన్ 20 అని నిర్ధారించబడింది మరియు ఉపాసన నిన్న ఆసుపత్రిలో చేరింది. అపోలో ఆస్పత్రిలో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు.

ఉపాసన, అప్పుడే పుట్టిన పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహితులు తెలిపారు. ఉపాసన మొదటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్టర్ల పర్యవేక్షణలో తన ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా చూసుకుంటుంది. అలాగే ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ చాలా చోట్ల తిరిగారు, ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరు కనిపించారు.

మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్‌తో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా ఆసుపత్రిలో ఉండటంతో ఆమె కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనవరాలిని చూసి చాలా హ్యాపీగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

read more :

Ram Charan : నాకు పుట్ట‌బోయే బిడ్డ‌కు జపాన్ తో సంబంధం ఉందంటూ రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: చిరంజీవి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్ గురించి జీ 20 సద‌స్సులో రివీల్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

 

Exit mobile version