Telugu Flash News

Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ నిర్ణ‌యం.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్

ram chaan upasana at oscars

ram chaan upasana at oscars

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ మ‌రి కొద్ది రోజుల‌లో గుడ్ న్యూస్ విన‌బోతున్నాడు. ఉపాస‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న నేప‌థ్యంలో చ‌ర‌ణ్ పాటు చిరంజీవి ఫ్యామిలీతో , మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్ప‌టి నుండి చాలా బిజీగా ఉన్న రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య‌తో టైమ్ స్పెండ్ చేయలేక పోయాడు.

ప్రస్తుతం ఏడో నెల ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసన కోసం.. ఇక నుంచి టైమ్ కేటాయించాలి అని చెర్రీ భావిస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఇప్పటి నుంచి మరో మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని.. ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్. ఇప్పటి నుంచే ఉపాసనకు సపోర్ట్ గా.. ఆమెతో పాటు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

రెండు నెలల్లో వారసుడు రానుండటంతో.. ముందు రెండు నెలలు.. బిడ్డ పుట్టిన తరువాత మరో నెల బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అని త‌న షూటింగ్‌కి మూడు నెల‌ల పాటు బ్రేక్ ఇచ్చాడ‌ట చెర్రీ. మెగా హీరో తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

also read :

Horoscope (20-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

TruthGPT : ఛాట్‌ జీపీటీకి పోటీగా ఎలన్‌మస్క్‌ కొత్త అస్త్రం.. ట్రూత్‌ జీపీటీ పేరిట ఏఐ!

Exit mobile version