HomecinemaRam Charan : నాకు పుట్ట‌బోయే బిడ్డ‌కు జపాన్ తో సంబంధం ఉందంటూ రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan : నాకు పుట్ట‌బోయే బిడ్డ‌కు జపాన్ తో సంబంధం ఉందంటూ రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్స్

Telugu Flash News

Ram Charan: చిరంజీవి త‌నయుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చ‌రణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాడు. 15 ఏళ్ళ కెరీర్‌లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు మెగా ప‌వర్ స్టార్. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో క‌నిపించిన చ‌ర‌ణ్‌.. ఈ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు.

కశ్మీర్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో భారతీయ చిత్ర పరశ్రమ తరుపున కేంద్రం రామ్ చరణ్‌కు ఆహ్వానం అందించ‌డం విశేషం. అయితే ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రామ్ చర‌ణ్ అనేక విష‌యాల గురించి మాట్లాడాడు. ఇదే వేదికపై తన భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి కూడా ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

రామ్ చరణ్-ఉపాసన వివాహం చేసుకొని దాదాపు పదేళ్లకి పైనే అవుతుంది. వీరు ప‌లు కార‌ణాల వ‌ల‌న చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు సంతోషం అంతా ఇంతా కాదు. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను ఓ వేడుక‌లా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక చిరు ప్ర‌క‌ట‌న స‌మ‌యం నుండి మెగా వార‌సుడు ఎప్పుడెప్పుడు వ‌స్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు వేయి కళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

అయితే జీ 20 స‌ద‌స్సులో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌.. జపాన్ దేశం తన జీవితంలో ఎలాంటి ప్రత్యేక స్థానాన్ని కలిగిందో చెప్పుకొచ్చాడు. జపాన్ తనకు ఇష్టమైన ప్రదేశంగాచెప్పిన చ‌ర‌ణ్‌..తన భార్య ఉపాసనతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్లేసుతో మంచి అనుబంధం ఉంద‌ని తెలియ‌జేశాడు. రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. నాకు యూరప్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు జపాన్ దేశాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా భార్య ఉపాసనకు ప్ర‌స్తుతం ఏడో నెల. అయితే ఈ మ్యాజిక్ జరిగింది జ‌పాన్‌లోనే.. జపాన్ దేశం, అక్క‌డి ప్రజలు, వారి సంస్కృతి నాకు ఎంతో ఇష్టం, అని రామ్ చరణ్ తెలియ‌జేశాడు.

అయితే గత ఏడాది జపాన్ దేశంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ట్రిపుల్ ఆర్ సినిమా విడుద‌లైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్-ఉపాసన అక్కడికి వెళ్ల‌గా, ఆ సమయంలోనే ఉపాసన గర్భం దాల్చారని రామ్ చరణ్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రం కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొంద‌నుంది.

read more :

-Advertisement-

Sarath Babu: సోద‌రి కూతురిని ద‌త్త‌త తీసుకోవాల‌నుకున్న శ‌ర‌త్ బాబు..కాని ఎందుకు ఆగింది..!

Harish Shankar: సురేష్ కొండేటి కి దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్.. అస‌లేమైందంటే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News