HomecinemaRam Charan: ఆస్కార్ వ‌చ్చిన సంతోషంలో త‌న భార్య ఎన్నో నెలో చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: ఆస్కార్ వ‌చ్చిన సంతోషంలో త‌న భార్య ఎన్నో నెలో చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

Telugu Flash News

Ram Charan: ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆర్ఆర్ఆర్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. తెలుగు సినిమా ఆస్కార్ సాధించ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అభిమానులంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాజమౌళి విజన్ ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకోవ‌డంతో ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ , ఎన్టీఆర్, రాంచరణ్ గాలిలో తేలియాడారు అనే చెప్పాలి.

ఇక రామ్ చ‌ర‌ణ్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నాడు. త‌న భార్య ఉపాసన ఆస్కార్‌కి సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత రాంచరణ్, ఉపాసన మీడియాతో మాట్లాడ‌గా, ఆర్ఆర్ఆర్ ఫ్యామిలిలో భాగంగా నేను కూడా ఇక్క‌డికి వచ్చాను అని ఉపాస‌న పేర్కొంది.

ram chaan upasana at oscars
ram chaan upasana at oscars

ఇక రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఉపాస‌న 6 నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే చాలా ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అంటూ రాంచరణ్ తెగ సంతోషాన్ని వ్య‌క్త ప‌రిచాడు. గత కొన్ని వారాల క్రిత‌మే యుఎస్ వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గ‌డిపిన విష‌యం తెలిసిందే.

-Advertisement-

Also Read :

oscar award for naatu naatu : నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్.. దేశం మీసం మెలేసిన ఆర్ఆర్ఆర్..

Naatu Naatu at Oscars 2023 : ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు ప్ర‌ద‌ర్శ‌న‌.. వీడియో

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News