Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ అభిమానులకి పసందైన వినోదం అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్‌రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుండగా, ఈ మూవీపై ప్రతి ఒక్కరు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి కొన్నిఆసక్తికర విషయాలు పంచుకున్నాడు . రామ్ చరణ్ కథానాయకుడిగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కించిన చిత్రం జంజీర్. తెలుగులో ఈ మూవీ తుఫాన్ పేరుతో విడుదలైంది. ఇది ప్లాప్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.
జంజీర్ తర్వాత రామ్ చరణ్ .. అపూర్వ లఖియాను దూరం పెట్టారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో ”రామ్ చరణ్, తాను మంచి స్నేహితులమని, ‘జంజీర్’ తర్వాత కూడా ఎన్నో సార్లు వాళ్లింటికి వెళ్లినట్లు అపూర్వ చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ వాళ్ల ఇంట్లో చాలారోజులు ఉన్నానని, ఇప్పుడు మాత్రం తన ఫోన్ తీయడంలేదని చెప్పారు.
సినిమా పనుల్లో బిజీగా ఉండటంవల్ల ఫోన్లకు ఆన్సర్ చేయడంలేదని, తన ఫోన్లకు ఉపాసన ఆన్సర్ చేస్తుందని, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ అపూర్వ లఖియా క్లారిటీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో తాము మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్‌లో షూటింగ్ జరిగేటప్పుడు చరణ్ ఫోన్ చేసినట్లు కూడా ఆయన చెప్పుకున్నారు.
హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు తనను కలుస్తాడని అపూర్వ లఖియా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. రాంచరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ ఇలా స్టార్ కాస్టింగ్ తో జంజీర్ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ఎందుకో ఆ మూవీ జనాలకు ఎక్కలేదని తెలియజేశారు. కాగా, ‘జంజీర్’తో రామ్ చరణ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.
ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటించగా, ఈ మూవీ 2013లో వచ్చి విఫలమైంది.. రామ్ చరణ్, ప్రియాంక జోడీ బాలేదంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్.. ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ప్రియాంక చోప్రాని కలిసి వారితో సందడి చేయడం మనం చూశాం.
read more news :
IPL 2023 | ఆ చివరి బాల్ అలా వేసి ఉంటే బాగుండేది : గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ
Allu Arjun : మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు రచ్చ.. మా నాన్నే దేవుడంటూ బన్నీ కామెంట్స్