HomecinemaRam Charan: క్రికెట్ టీమ్ కొన‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. పూర్తి క్లారిటీ ఇదే..!

Ram Charan: క్రికెట్ టీమ్ కొన‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. పూర్తి క్లారిటీ ఇదే..!

Telugu Flash News

Ram CharanL: ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్ అన్ని రంగాల‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ముఖ్యంగా బిజినెస్ రంగంలోను స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు. ఇప్పటికే మెగా హీరోకి పోలో టీమ్‌ ఉండగా.. ట్రూజెట్‌ పేరుతో ఎయిర్‌లైన్స్‌ రంగంలోనూ రాణించాడు. ఇక గ‌త కొద్ది రోజులుగా క్రికెట్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. చెర్రీ ఏపీఎల్‌లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్ర‌చారం జ‌రిగింది.

ram charan entry in IPL

ఈ క్ర‌మంలో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్స్‌ శ్రీనుబాబు, నరేంద్ర రామ్‌, సీఈవో భరణి మాట్లాడుతూ… రామ్‌చరణ్‌ లాంటి స్టార్ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌లో భాగమయితే మేము ఎంతో సంతోషిస్తాం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైజాగ్ వారియర్స్ సిఈవో భరణి స్ప‌ష్టం చేశారు.. త్వరలోనే మీడియా సమావేశాన్నికూడా ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.. రామ్ చరణ్ ప్ర‌స్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’ చిత్రం చేస్తున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News