HomecinemaRam Charan: ఆస్కార్ బ‌రిలో రామ్ చ‌ర‌ణ్‌.. మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్..!

Ram Charan: ఆస్కార్ బ‌రిలో రామ్ చ‌ర‌ణ్‌.. మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్..!

Telugu Flash News

Ram Charan: సినీ ప‌రిశ్ర‌మ‌లోని అత్యుత్త‌మ అవార్డుల‌లో ఆస్కార్ ఒక‌టి. ఈ అవార్డ్ ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు క‌ల‌లు కంటారు. ఇప్ప‌టి వ‌రకు హాలీవుడ్ ప్ర‌ముఖులు మాత్రమే ఎక్కువ ఆస్కార్ అవార్డులు ద‌క్కించుకోగా, టాలీవుడ్ స్టార్స్‌కి మాత్రం ఇది అందని ద్రాక్ష‌గానే మారింది.

అయితే ఈ సారి ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌లో ఒక‌రు త‌ప్ప‌క ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంటుంద‌ని జోస్యాలు చెబుతున్నారు.

‘ఆర్ఆర్ఆర్’లో అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబర్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆస్కార్ బరిలో నిలుస్తాడ‌ని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ‘ఎన్టీఆర్’ పేరు ఈ లిస్ట్‌లో ఉండగా.. తాజాగా చెర్రీ పేరు కూడా వ‌చ్చి చేరింది.

మెగా ఫ్యాన్స్ ఖుష్‌..

దేశం మెచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫామెన్స్ పీక్స్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ న‌టులు వీరి న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. అద్భుత‌మైన రివ్యూలు కూడా ఇచ్చారు.

సినిమాలోని కొన్ని ఎలివేషన్ షాట్స్, వీఎఫ్ఎక్స్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లు, ఇంటర్వెల్ షాట్ మెస్మ‌రైజ్ అయ్యేలా చేశాయి.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ కూడా పీక్స్‌లో ఉండ‌డంతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆయన పేరు ప్రముఖ మీడియా సంస్థ ‘వెరైటీ’ లిస్టులో ఇప్పటికే చేర్చింది.

-Advertisement-

ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్ పేరును కూడా ‘వెరైటీ’ సంస్థ రీసెంట్ గా అప్డేట్ అయిన లిస్టులో చేర్చింది. 35వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా, 36వ స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఉంచింది.

ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాల లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డు కూడా రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజులు ప్రధాన పాత్రలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతా రామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌నిపించి మెప్పించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News