Telugu Flash News

Ram Charan: నెల రోజుల పాటు రామ్ చ‌ర‌ణ్‌కి సెల‌వులు.. ఎందుకో ?

ramcharan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ కు అనుకోకుండా నెలరోజులు సెలవులు వచ్చాయట. ఈ నెల రోజులు రామ్ చ‌ర‌ణ్‌ ఏం చేయబోతున్నాడు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. నెల రోజుల పాటు ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేస్తాడా..? లేక సినిమా కథలు వింటాడా..? అని మెగా అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే అస‌లు కార‌ణం అది కాద‌ట‌. శంకర్ భారతీయుడు 2 కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేయడం వ‌ల్ల‌నే ఆర్సీ15 కి బ్రేక్ ఇచ్చాడట. ఇండియన్2 షూటింగ్ లాంగ్ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరగబోతుండ‌గా, కీలకషెడ్యూల్ కోసం చెన్నై వెళ్లిన శంకర్.. రామ్ చరణ్ సినిమాకు 30 రోజులు గ్యాప్ ఇచ్చాడ‌ని చెబుతున్నారు.

ఇక రామ్ చరణ్ ఈ 30 రోజులు ఏం చేయాలి అనేదానిపై ప‌లు ఆలోచ‌న‌లు చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం విదేశాలకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు… ఉపాసన గర్భవతి కావడంతో.. ఆమెతో లాంగ్ ట్రిప్స్ వేయ‌డం కుద‌ర‌దు. ఆమెతో ఎక్కువ స‌మ‌యం కేటాయించే స‌మ‌యం దొర‌క‌డంతో ఈనెల రోజులు ఉపాస‌న‌తోనే ఉంటాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈమధ్యలో చరణ్ ఆస్కార్ వేడులకలకు వెళ్ల‌నున్నాడు. ఫారెన్ టూర్ వెళ‌తాడు అనే దానిపై క్లారిటీ లేదు.. ఇక ఇవి కాకుండా బుచ్చిబాబు సినిమాకు సబంధించిన డిస్కర్షన్స్ కూడా చేయ‌నున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది.

also read :

Taraka Ratna Passed Away : నందమూరి తారక రత్న కన్నుమూత

Viral Video : మల్లెపూలతో ఎంత సక్కగున్నవే తెల్ల పిల్లా..!

Exit mobile version