Ram Charan: ఇండియన్ సినిమాకు భారీతనం పరిచయం చేసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో పక్కా పొలిటికల్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి శంకర్ అవుట్ సైడ్ కోలీవుడ్ హీరోతో మూవీ చేస్తుండగా, ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికలు మూవీలో ప్రధాన అంశంగా ఉంటాయని ప్రచారం జరుగుతుండగా, తాజాగా దిల్ రాజు రీసెంట్ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Game Changer : మళ్లీ అడ్డంగా దొరికిన థమన్.. టైటిల్ బీజీఎం కూడా కాపీ చేశావా..!
దిల్ రాజు కామెంట్స్ గతంలో గేమ్ ఛేంజర్ కథపై ప్రచారమైన కథనాలకు దగ్గరగా ఉండడంతో కథ ఇదే అంటూ టాలీవుడ్ వర్గాలలొ అనేక చర్చలు నడుస్తున్నాయి. చిత్రంలో రామ్ చరణ్ ఒక పొలిటికల్ లీడర్ అని, విలన్స్ ఆయన కుటుంబాన్ని నాశనం చేయడంతో… తండ్రికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకునేందుకు ఎన్నికల అధికారిగా మారిన కొడుకు ప్రత్యర్థులను అణచివేసే ప్రణాళిక మొదలుపెడతాడు. ఆ విధంగా తండ్రి ఓటమికి కారణమైన వాళ్ళ మీద రివేంజ్ తీర్చుకుంటూ వెళతాడు.. మొత్తంగా ఇదే గేమ్ ఛేంజర్ మూవీ కథ అని అంటున్నారు.