Ram Charan: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. దాదాపు పదేళ్లుగా వీరద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ అభిమానులకి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు. త్వరలో వారి జీవితాల్లో వరుస పండుగలు చోటు చేసుకోబోతున్నాయి. పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చిన నేపథ్యంలో కుటుంబంలో సంతోషంలో మునిగి తేలుతున్నాయి.
ప్రగ్నెన్సీ సమయంలో కూడా ఉపాసన విదేశీ టూర్లు చుట్టొస్తుంది. రీసెంట్‌గా మాల్దీవులకి వెళ్లి వచ్చింది చెర్రీ- ఉప్సీ జంట. అయితే ఈ టూర్ గ్యాప్‌లో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంగతులు పంచుకుంది. రామ్ చరణ్ తో తన ప్రేమ ప్రస్తావన రాగా ఆయన ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో ఉపాసన చెప్పుకొచ్చింది.
రామ్ చరణ్ నాకు మొదటి గిఫ్ట్ గా హార్ట్ సింబల్ ఉన్న చెవి కమ్మలు ఇచ్చాడు అని స్పష్టం చేసింది.. అవి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన ఉపాసన తనకు రిటర్న్ గిఫ్ట్ గా అపరిమిత ప్రేమను ఇచ్చానని పేర్కొంది.. ఇక కడుపులో బిడ్డతో టూర్స్ తిరగడం ఆనందంగా ఉందని చెప్పిన ఉపాసన… మాతో పాటు బిడ్డ కూడా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడని పేర్కొంది. ఇక ఈ సమయంలో తాను కఠిన డైట్ ఫాలో అవుతున్నట్టు పేర్కొంది.
also read :
Upasana: ఇన్నాళ్లు పిల్లల్ని కనకపోవడంపై స్పందించిన ఉపాసన
Upasana : నేను అందంగా లేకపోయిన డబ్బుల కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు: ఉపాసన
Special Story : ఆ ఊరంతా ఉద్యోగులే.. సత్తా చాటుతున్న బంజారా గ్రామం