HomecinemaRam Charan: రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్‌ల గురించి ఎవ‌రికి తెలియ‌ని సీక్రెట్ ఏంటంటే....!

Ram Charan: రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్‌ల గురించి ఎవ‌రికి తెలియ‌ని సీక్రెట్ ఏంటంటే….!

Telugu Flash News

Ram Charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. న‌ట‌న‌, డ్యాన్స్‌లోను అదుర్స్ అనిపించాడు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అనే బిరుదుని అందుకున్న రామ్ చ‌ర‌ణ్ చిరుత సినిమాతో ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అయింది. ఇక ఆ సినిమా నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న టాలెంట్ నిరూపించుకుంటూ వెళుతున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. చివ‌రిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు రామ్ చ‌ర‌ణ్‌.

ఇందులో సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. అయితే రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. డాన్సుల కోసం రామ్ చ‌ర‌ణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నదేమీ లేద‌ట‌.

ఇంట్లో జరిగే ఫంక్షన్లూ, పార్టీలకూ సైతం తానెప్పుడూ సరదాకి కూడా డాన్స్ చేయలేదని చరణ్ ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఫంక్షన్ అయిన బ‌న్నీనే డ్యాన్స్ చేసేవాడ‌ట కాని రామ్ చ‌ర‌ణ్ అస్స‌లు చేసేవాడు కాద‌ట‌.

ఫస్ట్ టైమ్ ‘చిరుత’ సినిమా కోసమే చరణ్ డాన్సులు చేశాడట. అసలు తాను బాగా డాన్స్ చేయగలననని తనకు కూడా తెలియదనీ చెప్పుకొచ్చాడు చరణ్. డాన్సుల విషయంలో అస్సలు ప్రెజర్ కూడా తీసుకోని రామ్ చ‌రణ్ తొలి సినిమాలోనే త‌న డ్యాన్స్‌తో మైమ‌ర‌చిపోయేలా చేశాడు.

రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్‌ల‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతుంటారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతుంది.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News