Ram Charan: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. వీరి వివాహం జరిగి పదేళ్లు అయిన ఇప్పటికీ ఎంతో అన్యన్యంగా ఉంటారు. అయితే ఇప్పటికీ వీరికి పిల్లలు లేకపోవడమే అభిమానులని కాస్త బాధిస్తుంది.
బుల్లిమెగాస్టార్ మెగా కాంపౌండ్‌లో అడుగుపెడితే ఆ సందడే వేరుంటుంది అని అభిమానులు ముచ్చటించుకుంటూ ఉంటారు. అయితే అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న కల నిజం కానుందని తెలుస్తుండటంతో మెగా శిబిరాల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. అదేంటంటే మోరో ఆరు నెలల్లో రామ్ చరణ్, ఉపాసనలకి బుల్లి మెగాస్టార్ జన్మించబోతున్నాడట.
ప్రకటన ఎప్పుడో..
మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు వచ్చే సమయం దగ్గరలోనే ఉందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని, ఇలా చిరంజీవి కోరిక నెరబోతుందని వారు తెగ ఖుష్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు.
రామ్ చరణ్- ఉపాసనకు పెళ్లి జరిగి పదేళ్లు కావొస్తోంది. ఇప్పటికి ఈ దంపతులకు పిల్లలు కాకపోవడంతో ఆ గుడ్ న్యూస్ విన్న అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ శుభవార్తకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
అయితే ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు గానీ.. అప్పుడే మెగా అభిమానులు మాత్రం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇది నిజం కావాలని, మెగా ఫ్యామిలీ నుంచి ఈ గుడ్ న్యూస్ అధికారికంగా వినాలని ప్రతి మెగా అభిమాని ప్రార్ధిస్తున్నారు.
ఇక ఉపాసన విషయానికి వస్తే ఆమె అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన బిజీగా ఉంటూ పలు సోషల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది. ఇక. రామ్ చరణ్ తన సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Bhuvneshwar Kumar: ముందు మీది చూసుకోండి అని ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చి పడేసిన భువనేశ్వర్ భార్య
Gauri khan : కొడుకు డ్రగ్స్ కేసు విషయంపై తొలిసారి నోరు విప్పిన షారూఖ్ ఖాన్ భార్య