Ram Charan: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం భారతదేశంలో శక్తివంతమైన వ్యక్తి అని చెప్పాలి. ఆయన అడుగేసిన, ఏం పని చేసిన కూడా ఏదో వ్యూహం ఉంటుందని భావిస్తుంటారు.. కొద్ది రోజుల క్రితం అమిత్ షా.. ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వడంపై సహజంగానే అందరి దృష్టి ఆకర్శించింది. ఇక రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ .. అమిత్ షాని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన చరణ్ తన తండ్రితో కలిసి అమిత్ షాతో భేటి అయ్యారు.
ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నా కూడాఈ భేటి సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇక రామ్ చరణ్ ని ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ కు ఆహ్వానించగా, ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీతో రామ్ చరణ్ వేదికను పంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో పాల్గొనాల్సి రావడంతో చరణ్ హైదరాబాద్ కి రాకుండా నేరుగా ఢిల్లీలో దిగారు. ఆ కార్యక్రమం పూర్తైన తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ కానున్నారు.
also read :
Biryani ATM : నోరూరించే వేడి వేడి బిర్యానీ వచ్చేస్తుందిలా.. బిర్యానీ ఏటీఎం విశేషాలు
South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!