Telugu Flash News

Rakul Preet singh: ఛాన్స్‌ల కోసం కారులో ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని ఓపెన్‌గా చెప్పేసిన ర‌కుల్‌

Rakul Preet singh: చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల హృద‌యాలు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మ‌డు ఒకానొక టైంలో ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. పంజాబీ అమ్మాయి అయిన రకుల్ ప్రీత్ సైతం ఎవరి సపోర్ట్‌లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సౌత్ టు నార్త్ ఏలిన ఈ ముద్దుగుమ్మ‌కి ఇటీవ‌ల అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. అవ‌కాశాలు లేక నానా ఇబ్బందులు కూడా ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలు, అవకాశాల కోసం పడ్డ పాట్లు రకుల్ వెల్లడించారు.

రకుల్ సినిమా వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారట. రోజుకు ఐదు నుండి పది ఆడిషన్స్ ఇచ్చేవారట. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని రోజంతా దర్శకుల చుట్టూ తిరిగేవారని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి కారులోనే బట్టలు మార్చుకున్నాన‌ని కూడా పేర్కొంది. కాగా ఓ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారట. కొన్ని రోజులు షూటింగ్ చేశాక తనను తప్పించి వేరే హీరోయిన్ ని తెచ్చారట. అందుకు నేను బాధపడలేదు. కష్టపడకుండా ఏది దక్కదు. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించాను అని రకుల్ చెప్పుకొచ్చింది.

ర‌కుల్ తాజా చిత్రం ఛత్రీవాలీ జీ 5లో జనవరి 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ తో కూడిన రొమాంటిక్ కామెడీ కాగా, ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. గత ఏడాది వరుసగా నాలుగైదు హిందీ చిత్రాలు ఆమె నుండి విదలయ్యాయి. ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఈ అమ్మ‌డికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో మంచి బ్రేక్ రాగా, ఆ త‌ర్వాత టాప్ హీరోయిన్ గా దశాబ్దం పాటు పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యారు. భారతీయుడు 2 మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న విష‌యం తెలిసిందే.

also read :

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Central Govt: కేంద్రం సంచలన నిర్ణయం.. ట్విట్టర్‌, యూట్యూబ్‌కు కీలక ఆదేశాలు!

Rishi Sunak : బ్రిటన్‌ భద్రంగా ఉండాలంటే రిషి నాయకత్వమే ఉండాలి.. ప్రజల విశ్వాసం చూరగొన్న రిషి!

Exit mobile version