Jos Buttler: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్.. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున చెలరేగి ఆడిన జోస్ బట్లర్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏకంగా ఐదుసార్లు డకౌట్‌గా వెనుదిరగడంతో ఆర్ఆర్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేస్తూ.. సెంచరీలు కూడా నమోదు చేసిన ఘనత బట్లర్‌ది. ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు.
గతమెంతో ఘనం.. ప్రస్తుత సీజన్ ఓ పీడకల.. అన్నట్లు బట్లర్ ప్రదర్శన ఉంది. ఇప్పటి వరకు ఓ అర్ధశతకం మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేదు బట్లర్. గత సీజన్‌లో తన బ్యాట్‌తో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన జోస్ బట్లర్.. ఇప్పుడు ఖాతా తెరవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 4 బంతులు ఆడిన తర్వాత ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
మరోవైపు గత 3 మ్యాచ్‌ల్లోనూ జోస్ బట్లర్ పరుగులేవీ చేయకుండానే ఔటయ్యాడు. గత సీజన్‌లో జోస్ బట్లర్ బ్యాట్ నుంచి 4 సెంచరీలు చూసిన అభిమానులు.. ఇప్పుడు ఏంటీ దారుణ పరిస్థితి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తం సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, ఆరెంజ్ క్యాప్ విజేతగా కూడా నిలిచాడు బట్లర్. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్.. యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో బ్యాట్ ఝులిపించాడు. అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో ప్లేస్‌లో జైస్వాల్ ఉన్నాడు.
మరోవైపు జోస్ బట్లర్ మాత్రం పేలవ ఫామ్ కారణంగా ముఖ్యమైన మ్యాచ్‌ల్లో జట్టు ఓటమిపాలు కావాల్సి వచ్చింది. జోస్ బట్లర్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు గోల్డెన్ డక్ అయిన జాబితాలో మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, హెర్షెల్ గిబ్స్ పేరిట ఉండేది. శిఖర్ ధావన్ 2020 సీజన్‌లో 4 సార్లు డకౌట్ కాగా, హర్షల్ గిబ్స్ 2009 సీజన్‌లో 4 సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్నింగ్స్‌లో 95 పరుగులు బట్లర్ సాధించాడు.
Read Also : pavitra naresh : త్వరలోనే మా పెళ్లి.. మా కోసమే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్న నరేష్