Telugu Flash News

Rajamouli: తారక్, చరణ్ నాతో బ‌ల‌వంతంగా వోడ్కా తాగించారు అంటూ రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్

Rajamouli: రాజమౌళి ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడుగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌తో ట్రిపుల్ ఆర్ సినిమా తీసి ఇప్పుడు దీనిని ఆస్కార్ బ‌రిలో నిలిపాడు. ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళికి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మంచి అనుబంధం ఉంది.

అయితే 12 ఏళ్ళ క్రితం.. అంటే 2010లో దర్శకుడు రాజమౌళి చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇంత‌కు ఆ ట్వీట్‌లో ఏముంది అంటే.. “లాస్ట్ నైట్ తారక్ బర్త్ డేలో ఫుల్ గా ఎంజాయ్ చేశాం. నేనెంత వొద్దన్నా.. వినకుండా తారక్, చరణ్ ఇద్దరూ నాతో బలవంతంగా వోడ్కా తాగించారు. అదే పార్టీలో బాలయ్య డ్యాన్స్ తో అదరగొట్టేశాడు.” అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు జ‌క్క‌న్న‌.

12 ఏళ్ల క్రిత‌మే వీరి మ‌ధ్య అంత స్నేహం ఉండ‌గా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఈ త్ర‌యం ప్రేక్ష‌కుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేశారు. అయితే బాల‌య్య‌కి, ఎన్టీఆర్‌కి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న క్ర‌మంలో తారక్ బర్త్ డేలో బాలయ్య డ్యాన్స్ చేశాడు అనేది ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.

also read :

Women’s Day Special : ఓ రైతుకు ఐదుగురు కుమార్తెలు.. అందరూ ఐఏఎస్ అధికారులే!

H3N2 Virus : ఏడు రోజులైనా జ్వరం, దగ్గు తగ్గడం లేదా? ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక!

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

Exit mobile version