Telugu Flash News

Raj-Koti :సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ తో ఎందుకు విడిపోవ‌ల్సి వ‌చ్చిందో చెప్పిన కోటి

RAJ KOTI

Raj-Koti : టాలీవుడ్‌లో ఇటీవ‌లి కాలంలో చాలా మంది అకాల మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. గొప్ప లెజెండ్స్ కన్నుమూయ‌డంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ కన్నుమూసారు. రాజ్-కోటి సంగీత ద్వయంలో రాజ్(68) ఆదివారం నాడు గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. రాజ్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సంగీత ప్రపంచంలో రాజ్-కోటి ద్వయం 80వ, 90వ దశకంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌ముఖ సంగీత దర్శకుడు కోటితో కలిసి రాజ్-కోటిగా ఏర్పడి రాజ్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు చ‌క్క‌ని బాణీలు అందించారు. 150కి పైగా చిత్రాలకు వీరు క‌లిసి పనిచేశారు.

ముఠా మేస్త్రీ, బావా బావమరిది, గోవిందా గోవిందా, హలో బ్రదర్ లాంటి సూపర్ డూపర్ హిట్లు వీరి కాంబినేష‌న్‌లో ఉన్నాయి. 90వ దశకం మధ్యలో కోటితో కొన్ని విభేదాలు వచ్చి రాజ్ విడిపోయిన విష‌యం మ‌న‌కు తెల‌సిందే . అయితే రాజ్-కోటి నుంచి విడిపోయిన తర్వాత ఈయన సొంతంగా సిసింద్రి, రాముడొచ్చాడు లాంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

అయితే రాజ్ మృతితో కోటి చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ‘నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విని షాక్ అయ్యాను. నా రాజ్ చనిపోయారనే వార్తను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేకపోతోన్నాను. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్న‌ప్పుడు అత‌నినిన చూస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారనే వార్త తెలిసి చాలా బాధ‌గా ఉంద‌ని కోటి అన్నారు.

మేం ఇద్దరం క‌లిసి తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ ఇక‌ లేడనే వార్త విన‌డానికి కూడా చాలా బాధ‌గా ఉంది అని కోటి చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే వారు విడిపోవ‌డానికి కోటి ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు. ఒక‌ రోజు రాజ్ మనం విడిపోయి, ఎవరి మ్యూజిక్ వాళ్ళం చేసుకుందాం అని చెప్పారు. అప్పుడు దానికి నేను కూడా ఓకే చెప్పాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు, గొడ‌వ‌లు లేవు. పదేళ్లకు పైగా కలిసి మ్యూజిక్ అందించాము .

అస‌లు రాజ్ నేను ఎందుకు కలిసి పని చేశాయో, ఎందుకు విడిపోయామో అర్ధం కాదు. మేము విడిపోవ‌డాన్ని సింగర్ ఎస్పీ బాలు జీర్ణించుకోలేక‌పోయారు. ఎవరూ లేనప్పుడు నా వద్దకు వచ్చి మళ్లీ మీ ఇద్దరు క‌లిసి ప‌ని చేయండి. మీది చాలా మంచి కాంబినేషన్ అనేవారు. ఒకసారి ఇద్దరం కలిసి మ్యూజిక్ చేస్తున్నామని ప్రకటించిన‌ప్ప‌టికీ, అప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అని కోటి తెలియ‌జేశారు. అయితే సంగీత దర్శకుడు రాజ్ ఇలా అకాల మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

also read :

today horoscope in telugu : 22-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Nayanthara: న‌య‌న‌తార కొత్త వ్యాపారం.. మ‌హేష్‌, అల్లు అర్జున్ బాట‌లోనే..!

Exit mobile version