Homebigg boss telugu season 6Bigg Boss 6 : ఆడియ‌న్స్ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా ఎలిమినేష‌న్.. ఏంటిది బిగ్ బాస్?

Bigg Boss 6 : ఆడియ‌న్స్ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా ఎలిమినేష‌న్.. ఏంటిది బిగ్ బాస్?

Telugu Flash News

Bigg Boss 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 మరో రెండు వారాల‌లో పూర్తి కానుంది. 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా, ప్ర‌స్తుతం ఎనిమిది మంది మాత్ర‌మే ఉన్నారు. గ‌త వారానికి ఏడుగురు నామినేట్ కాగా, ఇందులో ఇనయా, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో శ్రీసత్య, శ్రీహాన్,ఇనయా సేవ్ అయ్యారని శ‌నివారం నాగార్జున తెలిపారు. ఇక ఆదివారం ఎపిసోడ్ స‌మ‌యానికి ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్ నామినేషన్స్ లో మిగిలారు. వీరిలో ఫస్ట్ రోహిత్ సేవ్ కాగా, అనంత‌రం ఆదిరెడ్డి సేవ్ అయ్యారు.

అయితే ఆదిరెడ్డి, ఫైమా, రాజ్ ఎలిమినేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఎవిక్ష‌న్ పాస్ వాడ‌తావా లేదా అని నాగార్జున అడిగిన‌ప్పుడు అందుకు ఆమె స‌మాధానం ఇస్తూ ఇద్దరు ఉన్నప్పుడు చెబుతానని ఫైమా తెలిపింది. ఆదిరెడ్డిని కూడాసేవ్ చేసిన త‌ర్వాత ఫైమా, రాజ్ ల‌లోఒక‌రు ఎలిమినేష‌న్ కానున్నార‌ని నాగార్జున చెప్ప‌గా ఫైమా ఎవిక్ష‌న్ పాస్‌ని రాజ్‌కి వాడేందుకు సిద్ధ‌మైంది. ఆ స‌మ‌యంలో నాగార్జున ఒక‌సారి ఆలోచించుకొని నిర్ణ‌యం తీసుకోమ‌న్నారు. డేంజర్ జోన్లో ఉన్న రాజ్ సైతం ఫైమా వాడుకోవడమే కరెక్ట్ అన్నాడు. అది ఆమె కష్టపడి గెలుచుకుంది కాబ‌ట్టి ఆ పాస్ తో నేను సేవ్ అయినా మంచిగా ఫీల్ కాను అన్నాడు.

ఫైనల్ గా ఫైమా ఆలోచించి తనకోసమే వాడుకుంటానని చెప్పింది. ఇక రాజ్, ఫైమాల‌లో ఇద్ద‌రికి త‌క్కువ ఓట్లు ఎవ‌రికి వ‌చ్చాయ‌నే రివీల్ చేశాడు నాగ్. త‌క్కువ ఓట్లు ఫైమాకి రాగా, పాస్ వ‌ల‌న సేవ్ అయింది. రాజ్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. జనాల ఓట్లను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్ ఎలిమినేషన్ జరిగిందని నెటిజెన్స్ త‌ప్పు పడుతున్నారు.ఇక ఎలిమినేటైన రాజ్ ని నాగార్జున నలుగురికి హగ్స్, మరో ఐదుగురికి పంచెస్ ఇవ్వ‌మ‌ని చెప్పాడు. తన ప్రియమైన కంటెస్టెంట్స్ గా ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్ లకు హగ్ ఇచ్చిన రామ్,. మిగిలిన ఐదుగురికి పంచెస్ ఇచ్చాడు.

also read news:

Jai Balayya: మరీ ఇంతలా కాపీ కొట్టాలా.. పరువు తీసావ్ కదయ్యా థ‌మ‌న్.. నెటిజ‌న్స్ ట్రోల్స్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News