Telugu Flash News

Ragi Health Benefits : రాగి జావ తాగితే ఆ రోగాలన్నీ దెబ్బ‌కు ఎగిరిపోతాయి…!

ragi health benefits

Ragi Health Benefits:మ‌న ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి.ఇందులో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతోపాటు బీ విటమిన్లు, ఐరన్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.

రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్న క్ర‌మంలో ఇటీవ‌ల కాలంలో ఎక్కువ మంది రాగిజావ‌ని తాగేందుకు ఆస‌క్తిచూపుతున్నారు. అయితే రాగి జావ వ‌ల‌న ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నందున‌, ఇవి తీసుకుంటే మధుమేహ రోగులకు చాలా మంచిది.

రాగులతో ఎన్నో లాభాలు..

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించేందుకు రాగులు ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఎక్కువ కాబ‌ట్టి, వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

రాగులు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలాన్ని కూడా చేకూరుస్తాయి. రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30 శాతం ఎక్కువ. ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారూ, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ తప్పనిసరిగా రాగుల‌ని తీసుకోవ‌డం మంచిది. ఇవి ఎముక‌ల‌ని బ‌లంగా మారుస్తాయి. వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవ‌డం వ‌ల‌న మంచి ఉప‌యోగంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

Bigg Boss 6: ఎర్ర‌గ‌డ్డ‌లో మాదిరిగా అర‌చుకున్న హౌజ్‌మేట్స్.. స‌హ‌నం కోల్పోతున్న ఆడియ‌న్స్

Viral Video: నిద్ర‌లేపింద‌నే కోపం.. తోటి పులిపై ఎలా దాడి చేస్తుందో చూడండి..!

 

Exit mobile version