radish for diabetes : దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ఇది భూమిలోనే పెరిగే తెల్లని దుంప. ముల్లంగి వాసన పచ్చిగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ఇది తినడానికి ఇష్టపడరు. అయితే, వంటల్లో ఇది యమ టేస్టీగా ఉంటుంది.
1. ముల్లంగిలో శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
2. ఫోలిక్ యాసిడ్, పొటాషియం, జింక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6 లాంటివి ముల్లంగిలో లభ్యమవుతాయి.
3. మధుమేహంతో బాధపడేవారు ముల్లంగిని తింటే మంచి ఫలితాలను పొందుతారు.
4. ముల్లంగిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చేస్తుంది.
5. ముల్లంగి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత తిన్నా లాభమే కలుగుతుంది.
6. ముల్లంగి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తీసుకోవాలి.
7. దీనికి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించే గుణం ఉంది. కాలేయ ఆరోగ్యానికి, కామెర్ల వ్యాధి రాకుండా ముల్లంగి దోహదపడుతుంది.
also read :
Samantha: సమంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!
aamir khan : వాక్ స్టిక్ సాయంతో నడుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?