Homecinemaచిరంజీవితో ఎప్పుడు గొడ‌వే, 'అన్‌స్టాపబుల్ - 2 'ఎపిసోడ్ లో రాధిక కామెంట్స్

చిరంజీవితో ఎప్పుడు గొడ‌వే, ‘అన్‌స్టాపబుల్ – 2 ‘ఎపిసోడ్ లో రాధిక కామెంట్స్

Telugu Flash News

ప్ర‌స్తుతం బాల‌య్య ఆహా వేదిక‌గా అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో కోసం ప‌లువురు ప్ర‌ముఖుల‌ని తీసుకొచ్చి వారి నుండి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు రాబ‌డుతుంటారు.

‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 నాలుగో ఎపిసోడ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా హాజరు కాగా, వారితో ముచ్చటించి.. వేదికపై క్రికెట్ ఆడుతున్న క్రమంలో రాధిక సడెన్ ఎంట్రీ ఇచ్చింది.. అంపైర్ లేకుండా గేమ్ ఏంటి అంటూ బాలయ్యతో కాసేపు సంద‌డి చేసింది.

ముగ్గురిని కూర్చోబెట్టి బాల‌య్య ప‌లు ప్ర‌శ్న‌లు సంధించాడు. రాధిక‌ని విచిత్ర‌మైన ప్ర‌శ్న‌లు అడిగాడు బాల‌య్య .

రాధికతో కలిసి నటించిన స్టార్ హీరోలపై ఆమె అభిప్రాయాల గురించి అడిగాడు. ‘‘కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీళ్లందరితో చేశావుగా.. నాలాంటి సూపర్ స్టార్‌తో నీకు ఛాన్స్ రాలేదు’’ అంటూ సరదాగా పంచ్ వేసిన బాలయ్య.

రజినీకాంత్‌లో నీకు నచ్చనిదేంటి..? అని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఎప్పుడు ఆయ‌న‌ పనిలో ఆయన ఉంటారు. కార్నర్‌లో ఎక్కడో కూర్చుంటారు’’ అని చెప్ప‌గా, వెంట‌నే బాలయ్య.. రజినీకాంత్‌తో బోరింగ్ అంటావు అంతేనా అని అడ‌గ‌డంతో, రాధిక కూడా అవును అన్నారు.

ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. వృత్తి మీద ఆయనకున్న ఏకాగ్రత సూప‌ర్.. అమితాబ్ బచ్చన్ రియల్ జెంటిల్‌మేన్ అని రాధిక అన్నారు.

-Advertisement-

ఇక ఆఖరిగా రాధికను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేసిన బాల‌య్య‌… ‘చిరంజీవిలో నీకు నచ్చనిదేంటి.. నాలో నీకు నచ్చినదేంటి?’ అని ప్ర‌శ్నించాడు. దీనికి రాధిక ఆస‌క్తిక‌ర సమాధానం చెప్పారు.

‘‘చిరంజీవితో ఎప్పుడూ గొడవే. నీతో అలాంటి ఫైట్లు ఏమీ ఉండవు క‌దా. ఏంటో తెలీదు కానీ.. ఏంటే నువ్వు ఎక్కువగా మాట్లాడతావు అని చిరంజీవి అంటారు. నువ్వు మాత్రం ఏంటి అని నేను అంటాను.

మా ఇద్దరి మధ్య కొంత వాదన జరుగుతుంది. సరదా ఉండదు. మధ్యలో ఆయన భార్య సురేఖ ఒక అంపైర్’’ అంటూ రాథిక కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇవి నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

మరిన్ని చదవండి :

మీజిల్స్ వైరస్ అంటే ఏమిటి?  లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సా మార్గాలివీ..

ఆపిల్ తో ప్రయోజనాలు ఎన్నో.. మీరూ తినండి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News