PVR: ఒకప్పుడు సాధారణ థియేటర్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. సామాన్యలు అయితే బెంచ్‌లో కాస్త క్లాస్ అయితే బాల్కనీలో కూర్చొని చూసేవారు. కాని రాను రాను థియేటర్స్ రూపు రేఖలు మారాయి. ఎన్నో మల్టీ ప్లెక్స్ లు వచ్చాయి. అధనాతన మోడల్స్‌తో వచ్చిన మల్టీ ప్లెక్స్ కి జనాలు బాగానే వెళుతున్నారు. మనకు మల్టీప్లెక్స్ అనగానే ముందుగా పీవీఆర్ గుర్తు వస్తుంది. పలు చోట్ల పీవీఆర్ మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రేక్షకులు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సంస్ద ఎవరూ ఊహించని షాక్ తగిలింది. తీవ్రనష్టాల్లోకి కూరుకుపోయిన కారణంగా దేశ వ్యాప్తంగా 50స్క్రీన్లని మూసివేయాలని అనుకుంటుంది పీవీఆర్.
మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో టాప్‌గా ఉన్న పీవీఆర్ సినిమా సంస్థ ఇటీవల తీవ్ర నష్టాల్లో కూరుకుపోవటవం వల్లనే మూసివేస్తున్నారనని అంటున్నారు. జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో పీవీఆర్- ఐనాక్స్‌కు దాదాపు రూ. 333 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం.. గతేడాది ఇదే సమయంలోనూ వందకోట్లకుపైగా నష్టాలు వాటిల్లిందట. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, బాలివుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటంతో ఈ సంస్థకి చాలా నష్టాలు వచ్చాయి. ఇక ఇటీవల ఓటీటీల డిమాండ్ పెరగడంతో చాలా మంది థియేటర్స్ వైపు చూడడం లేదు. అయితే, స్క్రీన్‌లు మూసివేసినా.. మల్టీప్లెక్స్‌లలోని మాల్స్ మాత్రం కొనసాగుతాయని పీవీఆర్-ఐనాక్స్ చెప్పుకొచ్చింది.
ఏడాది క్రితం పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు విలీనం అవ్వడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ సంస్థగా అవతరించాయి.పీవీఆర్-ఐనాక్స్ థియేటర్స్ పేరుతో భారత్, శ్రీలంకలో మొత్తం 1689 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు నడుపుతూ వస్తుంది ఈ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్-ఐనాక్స్ కొత్తగా 168 స్క్రీన్‌లను కూడా ఓపెన్ చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో 150-175 స్క్రీన్‌లను ఓపెన్ చేయాలని అనుకొని, వాటిలో 9 ఇప్పటికే ఓపెన్ చేయగా, 15 స్క్రీన్‌లు అనుమతి కోసం వెయిట్ చేస్తుంది. మరో 152 స్క్రీన్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాట్టుగా సమాచారం. అయితే సడెన్‌గా ఈ కంపెనీ తీవ్ర నష్టాల్లోకి జారిపోవడంతో మూసి వేయాల్సిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది..