HomecinemaPushpa2: ఇది క‌దా బ‌న్నీ క్రేజ్.. రికార్డ్ ధ‌ర‌కి పుష్ప‌2 ఆడియో రైట్స్..!

Pushpa2: ఇది క‌దా బ‌న్నీ క్రేజ్.. రికార్డ్ ధ‌ర‌కి పుష్ప‌2 ఆడియో రైట్స్..!

Telugu Flash News

Pushpa2: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాకి ఇండియ‌న్ ప్రేక్ష‌కులే కాదు విదేశీ ప్రేక్ష‌కుల సైతం మంత్ర ముగ్ధుల‌య్యారు.ఇక ఈ జోష్‌తోనే ప్ర‌స్తుతం పుష్ప‌2 చేస్తున్న‌రు. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

పుష్ప‌2కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. తాజాగా మూవీ యొక్క ఆడియో రైట్స్ ఏకంగా రూ. 65 కోట్ల భారీ ధరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ దక్కించుకున్నట్లు ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ ప్ర‌చార‌మే నిజమైతే ఇండియన్ సినిమాల్లో ఇది పెద్ద రికార్డు అనే చెప్పాలి. ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ భండారి, ధనుంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని సుకుమార్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర‌లో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News