HomecinemaPushpa 2: అల్లు అర్జున్ పుష్ప‌ 2 పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్..!

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప‌ 2 పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్..!

Telugu Flash News

Pushpa 2: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన సినిమా పుష్ప చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న నేప‌థ్యంలో త్వ‌ర‌లో రెండో పార్ట్ కూడా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే ఈరోజు (ఏప్రిల్ 5) అదిరే అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

Summer Skin Care: వేసవిలో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి..

ఒక పవర్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అంటూ ఈ గ్లింప్స్ మొదలైంది.  పుష్ప ఎక్కడ అంటూ మీడియా అండ్ పోలీస్ లు చూస్తుంటే, పుష్పని ఏమి చేశారంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్న విజువల్స్ ఈ గ్లింప్స్ లో మనం చూడొచ్చు.  దీని బట్టి చూస్తుంటే భన్వార్ సింగ్ షేఖావత్ (ఫహద్ ఫాసిల్) పుష్పని అరెస్ట్ చేయ‌గా, అత‌ను ఏం చేశాడు అనే దానిపై అంద‌రు కంగారు ప‌డుతున్నారు.

summer foods : వేసవిలో తప్పక తీసుకోవాల్సిన ఫుడ్స్‌ ఇవే..

కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉండ‌గా, ఏప్రిల్ 7 సాయంత్రం 4:05 నిమిషాలకు ఫుల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇందులో అల్లు అర్జున సరసన రష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా క‌నిపించ‌నున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News