Puri Jagannath: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే చిత్రాలు చేశాడు. కాని ఇటీవల మాత్రం పెద్దగా అలరించలేకపోతున్నాడు. పూరీ డైరెక్ట్ చేసిన లైగర్ చిత్రం ఎంత నిరాశకి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దెబ్బకు పూరీ జగన్నాథ్ సైలెంట్ అయిపోయాడు. మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో కనిపించాడు పూరీ. సొంతూరిలో మొత్తం కుటుంబ సభ్యులందరితో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భార్య లావణ్య జగన్నాథ్ , కొడుకు ఆకాష్ పూరి, కూతురు పవిత్రతో కలిసి హోమంలో పాల్గొన్నారు పూరీ జగన్నాథ్. వాటికి ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఛార్మి వలన పూరీకి లావణ్యకి మధ్య విబేధాలు తలెత్తాయని ఇద్దరు విడిపోతారని ఎన్నో ప్రచారాలు కూడా సాగాయి. కొద్దిరోజుల కింద ‘చోర్ బజార్’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీపై బండ్ల గణేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలా ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నా, వదిన’ అంటూ తాజా ట్వీట్ లో పేర్కొన్నారు బండ్ల.