Puri Jagannath: ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బడా హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ అదే ఉత్సాహంతో లైగర్ అనే భారీ బడ్జెట్ చిత్రం చేశాడు.ఈ సినిమా బెడిసి కొట్టింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఆగస్టు 25న విడుదలై, బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నష్టాలకు సంబంధించిన విషయంలో అనేక వార్తలు హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తున్నాం. పూరీ డిస్ట్రిబ్యూటర్స్‌కి సెటిల్‌మెంట్ కూడా చేస్తాడని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన తనకు ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
పూరీ పోలీస్ కంప్లైంట్
డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్‌లో తెలియజేశారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు పూరీ. శ్రీను, శోభన్‌లు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం పూరీ వాయిస్‌తో విడుదలైన ఆడియో ఫైల్ లో. ‘లైగర్’ వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని పూరీ వ్యాఖ్యానించాడు. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం పూరీ ముంబాయిలో ఉంటున్నట్టు చెప్పిన పూరీ , హైదరాబాద్ లోని తన ఇంట్లో వృద్ధురాలైన అత్తగారు, తన భార్య, కుమార్తె మాత్రమే వున్నారని వారిపై వరంగల్ శ్రీను, శోభన్ తన ఇంటి మీదకు దాడి చేస్తారని భయంగా వుందని ఫిర్యాదులో తెలియజేశారు.
Tollywood director Puri Jagannath today lodged a police complaint against a few film distributors who threatened and assaulted him pic.twitter.com/rurDyAoqfB
— greatandhra (@greatandhranews) October 26, 2022