HomecinemaPunch prasad :రోజు రోజుకి దారుణంగా మారుతున్న పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో

Punch prasad :రోజు రోజుకి దారుణంగా మారుతున్న పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్యం.. మ‌ళ్లీ ఆసుప‌త్రిలో

Telugu Flash News

Punch Prasad :జ‌బ‌ర్ధ‌స్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో త‌న‌దైన పంచ్‌లు వేస్తూ ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించే క‌మెడీయ‌న్ పంచ్ ప్ర‌సాద్. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా విధి ఆయన జీవితంపై పగపట్టింది. రెండు కిడ్నీలకు ప్రాబ్లమ్ రావడంతో.. ప్ర‌స్తుతం నరకం చూస్తున్నాడు పంచ్ ప్రసాద్. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం అధైర్య‌ప‌డ‌కుండా ముందుకు సాగుతున్నాడు. ప్రసాద్ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

Jabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

డాక్టర్లు చెప్పిన ప్రకారం పంచ్ ప్ర‌సాద్ క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయ‌న మరోసారి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న ఆరోగ్యం విష‌యంపై పంచ్ ప్ర‌సాద్ భార్య త‌మ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ఇంజక్షన్‌ కోసం ఆసుప‌త్రికి వచ్చాం. ఆయన కుడి చేతిపై ఇప్పటి వరకు దాదాపు 50 ఇంజెక్షన్లు చేశారు. అస‌లు డయాలసిస్‌ నొప్పి తట్టుకోలేము. డయాలసిస్‌ తర్వాత క్లీడ్‌ ఇచ్చినపుడు కొంచెం నొప్పి బాగా ఉంటుంది. ప్రసాద్‌ ఇంజెక్షన్లు అంటే వ‌ణికిపోతున్నాడు. ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవటానికి ఇంకా భ‌య‌ప‌డుతున్నాడు అని ఆయ‌న భార్య చెప్పుకొచ్చింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News