Punarnavi: సినిమాలు, టీవీ షోస్తో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన భామ పునర్నవి. బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఈ అమ్మడు చేసిన రచ్చ అందరికి గుర్తుండే ఉంటుంది. ఉయ్యాల జంపాల చిత్రంలో పునర్నవి క్యారెక్టర్ రోల్ లో మెరిసి మెప్పించింది.
అయితే బిగ్ బాస్ తర్వాత పునర్నవి కెరీర్ పీక్స్ కి వెళుతుందని అందరు అనుకున్నారు. కాని పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో లండన్ వెళ్లింది. అయితే ఇటీవల పునర్నవి గురించి షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల పునర్నవి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ లో ఆమె పొట్ట భాగం కాస్త బొద్దుగా కనిపిచింది. దీనితో పునర్నవి గర్భవతి అంటూ జోరుగా ప్రచారం చేశారు.
పునర్నవి తన గే ఫ్రెండ్ వల్ల గర్భవతి ఐంది అంటూ జోరుగా ప్రచారం చేశారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. తన గురించి అసభ్యంగా వైరల్ అవుతున్న రూమర్స్ పై పునర్నవి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
ఇది నాన్ సెన్స్. ఇటీవల నాకు కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడు పరిస్థితి క్రిటికల్ గా ఉందని రాసేశారు. ఇప్పుడు నేను గర్భవతిని అంటూ అసత్యాలు వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలని ఎవరూ నమ్మవద్దంటూ కోరింది.
also read:
Viral Video: పెళ్లిలో పన్నీర్ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..