Pruthvi: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు పృథ్వీ. కమెడీయన్‌గా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పలు వివాదాలు ఆయనకు బ్యాడ్ నేమ్ తెస్తున్నాయి. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, తన భర్త పృథ్వీరాజ్ తనను మానసికంగా వేధిస్తున్నాంటూ శ్రీలక్ష్మీ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆయన కోసం చాలా డబ్బులు ఖర్చు చేశామని చెప్పింది.
వివాదంలో పృథ్వీ…
పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లిసినిమా ప్రయత్నాలు చేసాడని, అప్పుడు ఖర్చులన్నింటిన తమ ఫ్యామిలీనే భరించిందంటూ శ్రీలేఖ పేర్కొంది. నా భర్త నన్ను నోటికొచ్చినట్టు తిడుతూ తనను చిత్ర హింసలుపెట్టాడంటూ ఆమె ప్యామిలీ కోర్డ్ ను ఆశ్రయించగా, భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల 8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆయన్ను ఆదేశంచింది న్యాయస్థానం. నాలుగేళ్లకు పైగా కోర్డ్ లో కోనసాగిన కేసుపై ఫైనల్ జడ్జిమెంట్ శ్రీలేఖకి ఫేవర్‌గా వచ్చింది. దీంతో పృథ్వీ ఇబ్బందుల్లో పడబోతున్నాడని తెలుస్తుంది.
ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని, దాంతో పాటు ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలని కోర్టు వారు ఆదేశించారు. ఇక పృథ్వీరాజ్ వైసీపీ అధినేత జగన్ సీఎం అయిన తరువాత ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు . లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్ను ఆ హోదా నుంచి తొలిగించడంతో జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నాడు. . కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబును కలిసి పృథ్వీరాజ్ తాను జనసేన లో చేరేందుకు సిద్దమంటూ ఆ పార్టీలో చేరారు. తాడేపల్లి గూడెం నుండి ఆయన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది.