Project K : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అందులో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ దివా దీపికా పదుకొనె నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ . ఆయన పాత్ర మహాభారతంలోని అశ్వత్థామ తరహాలో ఉంటుందని ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ప్రాజెక్ట్ కె విజన్, స్టోరీ ప్లాట్ పాయింట్ చాలా పెద్దది కనుక మేకర్స్ దీనిని రెండు భాగాలుగా రూపొందించాలని డిసైడ్ అయ్యారుని టాక్. బాహుబలి ఫ్రాంచైజీ మాదిరిగానే మొదటి భాగంలో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణను ఎలివేట్ చేసి ద్వితీయార్ధంలో ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేస్తారని టాక్ అయితే నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ క్లారిటీ రానుంది. రెండు పార్ట్స్ కూడా ఏడాది కంటే తక్కువ గ్యాప్‌లో విడుదల చేయనున్నారని టాక్.
also read :
ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్ తింటే తిరుగుండదు!
Adani Group : ఎఫ్‌పీవో రద్దు చేసుకున్న అదానీ గ్రూప్.. 20వేల కోట్లు ప్రాజెక్టుపై వెనక్కి!