Samantha: గత కొద్ది రోజులుగా సమంత, టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యం అంతా నాటకం అని, సింపతీతో తన సినిమాలకు ప్రచారం తెచ్చుకోవాలని చూస్తుందని, ఆమె ఏడుపు వలన సినిమాలు చూడరంటూ ఆమెపై దారుణమైన కామెంట్స్ చేశారు.
సమంతది ముసలి ముఖం అని కూడా అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సమంత ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తూ.. చిట్టిబాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని గురించి మాట్లాడింది. టెస్టోస్టిరాన్ అధికం కావడం వలన అలా ఆయన మాట్లాడుతున్నాడని, మదంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని ఇన్‌డైరెక్ట్ కౌంటర్ వేసింది సమంత.
తాజాగా దీనిపై చిట్టిబాబు స్పందిస్తూ. ఇవన్నీ తెలివైన సమాధానాలు అని ఆమె అనుకుంటుంది . నేను కనుక మాట్లాడితే ఆమె తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు, నా మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే ఆమె బాగుండేది, అని చిట్టిబాబు వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE