Priyanka Chopra: బాలీవుడ్ భామగా ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో ఇరగదీస్తుంది. కేవలం గ్లామర్ షో చేయడంలోనే కాదు తన కామెంట్స్ తో కూడా బోల్డ్ బ్యూటీగా వార్తలలో నిలుస్తుంటుంది ప్రియాంక చోప్రా. పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే కొత్తగా లవ్ ఎగైన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించగా, ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. అయితే రీసెంట్ గా ఆండీ కోహెన్‌తో జరిగిన షో వాట్ హ్యాపెన్స్ అనే ఇంటర్వ్యూలో ఆమె చాలా బోల్డ్‌గా మాట్లాడి ఆశ్చర్యపరచింది. తనకి, తన భర్తకి అలాగే తన భర్తకి పెళ్లికి ముందు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నట్లు ప్రియాంక పేర్కొంది.
కానీ గతాన్ని తవ్వుకోవడం మా ఇద్దరికీ ఇష్టం లేదు, అందుకే ఇప్పుడు చాల సంతోషంగా ఉన్నామని తెలియజేసింది. అలానే శృంగారం గురించి మరింత బోల్డ్ గా కామెంట్స్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్ తో డేట్ కి వెళ్లిన తొలి రోజే శృంగారం చేస్తారా అని ప్రశ్నించగా.. డేట్ లో ఫస్ట్ డేనే శృంగారం చేయడం వలన ఉపయోగం ఉంది కూడా. అతడు రొమంటికా కాదా అనేది ఫస్ట్ డేనే మనకు తెలిసిపోతుంది. రొమాంటిక్ కాకుంటే ఒక ఫేక్ నంబర్ ఇచ్చి వదిలించుకుంటా అంటూ చాలా స్టన్నింగ్ సమాధానం ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఓరల్ సెక్స్, చీజ్ ఈ రెండిట్లో ఏది గివ్ ఆఫ్ చేస్తావు అని అడిగితే.. ఏ మాత్రం తడుముకోకుండా ఓరల్ సెక్స్ కంటే చీజ్ ని వదిలేయడానికే ఎక్కువ ప్రాధాన్యని ఇస్తాను అంటూ ప్రియాంక చాలా హాట్ కామెంట్స్ చేసింది.
నీ బాయ్ ఫ్రెండ్స్ గురించి, సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా చెబితే ఎలా ప్రియాంక.. నిక్ జోనస్ ఏమి ఫీల్ కాడా అంటూ నెటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కొన్ని నెలల డేటింగ్ తర్వాత 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఇక సరోగసీ ద్వారా మొదటి బిడ్డ ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు. ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉంటూనే వైవాహిక జీవితం సజావుగా సాగేలా చూసుకుంటుంది బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బేవాచ్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్ మూవీలతో ప్రియాంక హాలీవుడ్‌లోత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకోపతుంది.