Telugu Flash News

Priya Prakash Varrier: పెళ్లైన హీరోపై మ‌న‌సు పారేసుకున్న ప్రియా ప్రకాశ్..

Priya Prakash Varrier Comments On Dhanush

Priya Prakash Varrier: క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. చూడ చక్క‌ని అందంతో పాటు అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది ప్రియా. ఈ అమ్మ‌డికి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేదు. తెలుగులోను ఈ అమ్మ‌డికి ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన కూడా ఆ సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో ప్రియ ప్ర‌కాశ్ అడ్రెస్ లేకుండా పోయింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాతోనే అల‌రిస్తుంది. సోష‌ల్ మీడియాలో ప్రియా ప్ర‌కాశ్ చేసే పోస్ట్‌లు ఒక్కొక్కళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటాయి.

గాలం వేస్తోందిగా..

సోషల్ మీడియాలో గ్లామర్ షో మొద‌లు పెట్టిన ఈ అమ్మ‌డు తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. ప్ర‌స్తుతం ప్రియా వారియర్ మలయాళం, తెలుగు , కన్నడ, హిందీ భాషల్లో కూడా చిత్రాలు చేస్తోంది. ఇంకా తమిళ ఇండస్ట్రీలోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు.

అయితే అక్కడి ఆడియన్స్ ని, స్టార్ హీరోలని బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందనే చెప్పాలి. ముందుగా ఈ మలయాళీ పిల్ల అక్క‌డి స్టార్ హీరో ధనుష్ కి గాలం వేసింది. కొద్ది రోజులుగా ధ‌నుష్ గురించి తెగ పోస్ట్‌లు పెడుతుంది.

ధనుష్ గురించి ఎందుకు ఇలా వ‌రుస పోస్ట్ లు పెడుతున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ఆయనంటే నాకు ఇష్టం , నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఆయ‌న‌పై ఉంద‌ని ప్రియా ప్ర‌కాశ్ చెప్పుకొచ్చింది. ధ‌నుష్ తో న‌టించాల‌ని ఎప్ప‌టి నుండో ఉంది. ఆ కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేరుతుంద‌ని భావిస్తున్నాను అంటూ మ‌న‌సులో మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టింది ప్రియా ప్ర‌కాశ్. పెళ్లైన హీరో గురించి ప్రియా ప్ర‌కాశ్ ఇలా ఓపెన్ గా మాట్లాడేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ అమ్మ‌డు చివరగా తెలుగులో నితిన్ సరసన చెక్ చిత్రంలో నటించింది. చెస్ నేపథ్యంలో రూపొందిన ఆ మూవీ నిరాశ‌ప‌ర‌చ‌గా, మ‌రో మంచి ఆఫ‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది.

Exit mobile version