Homeandhra pradeshఏపీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్‌ రాసలీలలు.. వీడియో నెట్టింట వైరల్‌!

ఏపీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్‌ రాసలీలలు.. వీడియో నెట్టింట వైరల్‌!

Telugu Flash News

విద్యార్థులకు, సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన ప్రిన్సిపల్‌ వక్రబుద్ధి చూపాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి గొప్ప జీవితాన్ని అలవర్చాల్సిన ప్రిన్సిపల్‌.. పాఠశాలలో వివాహేతర బంధం నెరపడం కలకలం రేపింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది. అక్కడ పని చేస్తున్న ప్రిన్సిపల్‌ ఆనంద్‌బాబు ఏకంగా స్కూల్లోనే రాసలీలలు చేస్తుండడంతో కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మచిలీపట్నంలోని ఉర్దూ గురుకుల పాఠశాలలో ఈ ఉదంతం జరిగింది. ప్రిన్సిపల్‌ ఆనంద్‌బాబు అక్కడే పని చేస్తున్న ఉద్యోగినితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. కొంత కాలంగా వీరు పాఠశాలలోనే చనువుగా ఉండటం గమనించిన విద్యార్థులు.. వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులే వీడియో తీశారనే అనుమానంతో ప్రిన్సిపల్‌ కొందరు పిల్లలను చితకబాదాడు. విషయం పోలీస్‌ స్టేషన్‌దాకా వెళ్లడంతో రాసలీలలు నడిపిన ప్రిన్సిపల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాసలీలల విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. డీవైఈవో సుబ్బారావు శనివారం గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. వీడియోలు పరిశీలించి విద్యార్థులు, అధ్యాపకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖాపరమైన చర్యల కోసం నివేదికను ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ కార్యదర్శికి అందజేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ కార్యదర్శి ఉబేదుల్లా కూడా పాఠశాలకు చేరుకొని వివరాలు ఆరా తీశారు.

పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా..

కొంతకాలంగా ప్రిన్సిపల్‌ ఆనంద్‌బాబు, అక్కడ పని చేసే యూడీసీ ఉద్యోగిని మధ్య వివాహేతర కార్యకలాపాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రిన్సిపల్‌తో బంధం పెట్టుకున్న మహిళ గతంలో ఉపాధ్యాయినిగా పని చేసింది. ఆమెను వివిధ కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులో చేరినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తోటి సిబ్బంది కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు విచారణలో వీరిద్దరూ అలాంటిదేమీ లేదని బుకాయిస్తుండడం గమనార్హం.

also read news:

Avatar 2 : అవతార్ 2 సినిమా కి థియేటర్స్ లో జనం కరువవుతున్నారట.. ఎందుకో తెలుసా ?

-Advertisement-

Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచై గురించి ఈ విష‌యాలు తెలుసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News