వాయుకాలుష్యం పెరిగి గాలి నాణ్యత ప్రమాదకార స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు మరియు 50 % శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన విషయం తెలిసిందే అయితే మంగళవారం నుంచి గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదలతో, ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు బుధవారం నుండి పునఃప్రారంభం కానున్నాయి మరియు ఉద్యోగులు కూడా బుధవారం నుంచి ఆఫీస్ కు హాజరు కావాల్సింది గ ప్రభుత్వం వెల్లడించింది . మరియు సెకండరీ పాఠశాలల విద్యార్థులకు బహిరంగ కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలు కూడా బుధవారం నుండి ఎత్తివేయబడతాయి అని తెలిపింది.
మూడు రోజుల క్రితం దేశ రాజధానిలో AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 450 ప్రమాదకర స్థాయికి చేరుకుంది అయితే ఈదేవిషయం పై పొరుగు రాష్ట్రాలు పంట పొలాలలో గడ్డి దగ్ధం పై కఠినమైన చర్యలు తీసుకుంటున్న కారణముగా వాయు కాలుష్యం ఆదివారం AQI 350 ఉదయం, “వెరీ పూర్” కేటగిరీ నుంచి సోమవారం AQI 339గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) పేర్కొంది .
ఢిల్లీ వాయు కాలుష్యం పై సవరించబడిన పరిమితులు & ఆంక్షలు :
దేశ రాజధానిలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం పాక్షికంగా ఎత్తివేయనునట్లు మరియు గత వారం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు 50 శాతం వర్క్ ఫ్రామ్ హోం ను కూడా ఎత్తివేయనునట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు.
” గత వారం వాయు నాణ్యత సూచిక 450కి చేరుకుంది (తీవ్రమైన కేటగిరీలో), మరియు ఆ సమయంలోనే సెంట్రల్ ప్యానెల్ చేసిన సిఫార్సు లను పాటించడం ద్వారా వేగమైన వృద్ధి కనిపించిందని మంత్రి తెలిపారు .
హైవే, రోడ్డు, ఫ్లైఓవర్, ఓవర్‌బ్రిడ్జ్, పైప్‌లైన్, పవర్ ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన నిర్మాణ పనులపై నిషేధం ఎత్తివేయబడింది, ”అని ఆయన అన్నారు. అయితే ప్రైవేట్ నిర్మాణ మరియు కూల్చివేత కార్యకలాపాలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.
BS III పెట్రోల్ వాహనాలు మరియు BS IV డీజిల్ వాహనాలపై ఆంక్షలు అలాగే కొనసాగే అవకాశము ఉందని , గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) యొక్క స్టేజ్ III కింద నిషేధం విధించబడిందని,ఆదివారం నుంచి గాలి నాణ్యత కాస్త మెరుగుపడడంతో పైన పేర్కొన్న కొన్ని ఆంక్షలను ఎత్తివేస్తునట్లు మంత్రి తెలిపారు .
also read: