Pregnancy Tips : గర్భిణులు ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు..ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఈ అంశాలు తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బిడ్డ ఎదుగుదలను కూడా మెరుగ్గా ఉంచుతుంది.. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.. మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలు మొదటి త్రైమాసికంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన పోషకాహారం. ఈ పోషకం బిడ్డతో పాటు తల్లికి కూడా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ అవసరం… అదేవిధంగా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. చికెన్, గుడ్లు, పెరుగు.. వంటి కొన్ని ఆహారాల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
పిల్లల ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు కాల్షియం చాలా ముఖ్యమైనది. మొదటి త్రైమాసికంలో తల్లి కాల్షియం తీసుకోవడం పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. క్యాల్షియం లోపిస్తే పిల్లలకు ఎముకల సమస్యలు వస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు తర్వాత వస్తాయి.
ముఖ్యంగా గర్భిణీలు తీసుకోవాల్సిన వాటిలో ఐరన్ ఒకటి. రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ శరీరానికి అందాలని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత సమస్య తగ్గుతుంది. కడుపులో బిడ్డ రంగును కూడా పెంచుతుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ విటమిన్ సి ఎంతో అవసరం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకలు, కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది.. చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.. ఈ విటమిన్లన్నీ సరిగ్గా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీ, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
read more :