HomecinemaPrabhu: ప్ర‌భు ఆరోగ్యానికి ఏమైంది.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Prabhu: ప్ర‌భు ఆరోగ్యానికి ఏమైంది.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Telugu Flash News

Prabhu: ఇటీవ‌లి కాలంలో సినీ పరిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖులు అనారోగ్యంతో క‌న్నుమూస్తున్నారు. సెల‌బ్రిటీలు ఆసుప‌త్రిలో చేరారంటే అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంటుంది. తాజాగా సీనియర్‌ నటుడు ప్రభు ఆసుప‌త్రిలో అడ్మిట్ కావ‌డంతో అభిమానుల‌లో ఆందోళ‌న నెలకొంది.

ప్ర‌భు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికి.. డబ్బింగ్‌ చిత్రాలు, డైరెక్ట్‌ తెలుగు చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ప్రస్తుతం ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగాఉన్నారు ఈ సీనియ‌ర్ న‌టుడు.

ప్రభు.. తాజాగా అస్వస్థతకు గురి కావ‌డంతో కుటుంబ సభ్యులు.. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్ర‌భు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. సమస్య తీవ్రం కావడంతో.. చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌భుని వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయనకు మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను తొలగించారని, ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు కూడా వైద్యులు స్ప‌ష్టం చేశారు.

also read :

Kidney Stones : కిడ్నీలో రాళ్లు.. ఎలా తెలుసుకోవాలి? సంకేతాలివే..! ఆలస్యం చేయకండి..!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News