HomecinemaPrabhas : సలార్, ఆదిపురుష్ తో అభిమానులలో భారీ అంచనాలు ? బాలీవుడ్ బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేస్తాడా ?

Prabhas : సలార్, ఆదిపురుష్ తో అభిమానులలో భారీ అంచనాలు ? బాలీవుడ్ బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేస్తాడా ?

Telugu Flash News

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. బాహుబలి వరుస సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరిగింది. అయితే బాహుబలి 2 తో ఉత్తరాది లో సంచలనం సృష్టించిన ప్రభాస్ ఇప్పుడు మళ్లీ తన సినిమాతో నార్త్ లో విశ్వరూపం సృష్టించనున్నాడు.

ఈ ఏడాది సలార్(salaar), ఆదిపురుష్ (adipurush)తో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలకూ బాలీవుడ్ (bollywood) లో క్రేజ్ మామూలుగా లేదు. అయితే ఈ ఏడాది ఉత్తరాది లో సౌత్ సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇక్కడ హిట్ అయిన కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయినా కలెక్షన్స్ మాత్రం రాలేదు. తన సినిమాలతో నార్త్ లో రికార్డ్ క్రియేట్ చేయడం ప్రభాస్ ఒక్కడికె సాధ్యం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

prabhas adipurush
adipurush

ఆదిపురుష్ పౌరాణిక సినిమా అవడం వల్ల ఉత్తరాది లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అయితే, నార్త్ లో పఠాన్ ఆల్ టైమ్ రికార్డ్‌ను ఒక్క సలార్ మాత్రమే అందుకునే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. ఒకే సంవత్సరంలో రెండు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ప్రేక్షకులు మరియు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాలకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

read more news :

Prabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ? న్యూస్ వైరల్!

Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌.. 70 దేశాల‌లో రికార్డ్ స్థాయిలో..!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News