Telugu Flash News

Prabhas : చిరంజీవి అడ్డాలో ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌..

prabhas farm house news

Prabhas : ఇటీవ‌లి కాలంలో సినిమాల కోసం భారీ సెట్స్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే సినిమా పూర్తైన త‌ర్వాత వెంట‌నే వాటిని తొల‌గించ‌కుండా వేరే సినిమాల కోసం వాడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గతంలో బాహుబలి వంటి సినిమాల సెట్స్ ని ఇత‌ర సినిమాల‌కి వాడారు. ఇది సిని పరిశ్రమలో రెగ్యులర్ గా జరుగుతూ వ‌స్తుందే.

అయితే ఇప్పుడు చిరంజీవి డిజాస్టర్ చిత్రం ఆచార్య సెట్ లో ప్రబాస్ సినిమా షూటింగ్ జ‌ర‌ప‌బోతున్నట్టు స‌మాచారం. ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా డీల‌క్స్ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో డిసెంబ‌ర్ నుంచి ప్రారంభం కాగా, ప‌లు కార‌ణాల వ‌ల‌న న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. అయితే ఫిబ్ర‌వ‌రి 19 నుండి నాన్‌స్టాప్ షెడ్యూల్ జ‌రుపుతున్నారు. ఆచార్య కోసం వేసిన పాద ఘట్టం సెట్ ను కొంత చేంజ్ చేసి సెట్ చేసినట్లు సమాచారం.

ప్లాష్ బ్యాక్ సీన్స్ ఇక్కడ షూట్ చేయబోతున్నార‌ని టాక్ న‌డుస్తుంది.. అలాగే ప్ర‌భాస్ సినిమా కోసం భారీ వ్య‌యంతో ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ను కూడా రూపొందించిన‌ట్టు టాక్. చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు వినికిడి.

also read :

Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Exit mobile version