Telugu Flash News

Prabhas: చికిత్స కోసం ఫారిన్‌కి ప‌య‌న‌మైన ప్ర‌భాస్… అస‌లేమైంది..!

prabhas salaar

Prabhas: డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. బాహుబ‌లితో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్ రానున్న రోజుల‌లో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

అయితే నాలుగు ప‌దుల వ‌య‌స్సుకి చేరిన ప్ర‌భాస్ ఇటీవ‌ల త‌ర‌చు అనారోగ్యం బారిన ప‌డుతుండ‌డం అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ సమయంలో ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వార్తలు రాగా, ఆ త‌ర్వాత నుండి ఆయ‌న త‌ర‌చు జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఫిబ్రవరిలో కూడా డార్లింగ్ జ్వరం బారిన పడ్డాడ‌ని, దీని వ‌ల్ల‌నే మారుతి సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిందని వార్త‌లు వ‌చ్చాయి.. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రభాస్ ఆరోగ్యం గురించి ఇండస్ట్రీలో కొత్త‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చికిత్స కోసం ప్ర‌భాస్ ఫారెన్ వెళ్లాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కాని క్యాజువల్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లాడు అని చెబుతున్నారు. ఇక ప్రభాస్ హెల్త్ ఇష్యూ కారణంగా సలార్ తో పాటుగా, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లు వాయిదా పడే అవకాశం ఉంద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

also read :

TSPSC Paper Leak : పేపర్ లీకేజీ ఘటనలో నిందితురాలి బ్యాగ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

Viral Video : ఎన్‌కౌంటర్‌ చేయబోమని రాసివ్వాలి.. అప్పుడే ఆస్పత్రికి వస్తానంటూ ఖైదీ హల్‌ చల్‌!

Exit mobile version