HomecinemaPrabhas: ఫ్యాన్స్ అసంతృఫ్తి... ప్ర‌భాస్‌తో కార్టూన్ సినిమాలు తీస్తున్నారంటూ ఫైర్

Prabhas: ఫ్యాన్స్ అసంతృఫ్తి… ప్ర‌భాస్‌తో కార్టూన్ సినిమాలు తీస్తున్నారంటూ ఫైర్

Telugu Flash News

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ అన్ని భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన సాహో హిందీలో మంచి విజ‌యం అందుకున్నా ఆ త‌ర్వాత వ‌చ్చిన ’రాధే శ్యామ్’ సినిమా మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ భవిష్యత్తులో తమ హీరో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని చూసి బౌన్స్ బ్యాక్ చాలా తేలికగా అవుతాడు, భయపడాల్సిన అవసరం లేదంటూ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఆదిపురుష్ టీజ‌ర్ చూసి వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభాస్ లాంటి స్టార్ తో కార్టూన్ సినిమాలు తీస్తారా అని అభిమానుల చేత చివాట్లు తిన్నారు చిత్ర బృందం . ఇక ప్రభాస్ చేతిలో ఉన్న మరో క్రేజీ మూవీ ‘ప్రాజెక్ట్ K’ కాగా, ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

తాజాగా చిత్రానికి సంబంధిచిన‌ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పోస్టర్ ని చూస్తే ఎదో వీడియో గేమ్ కోసం చేసినట్టు అనిపిస్తుంది. ఇది చూసి అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.ఇలా ప్రభాస్ తో వందల కోట్ల రూపాయిలు సినిమాలు తీస్తున్నామని చెప్పి ఫ్యాన్స్‌తో ఆడుకుంటున్నారా అని ఫైర్ అవుతున్నారు.

also read :

George Soros : జార్జ్‌ సోరస్‌పై జైశంకర్‌ తీవ్ర ఆగ్రహం.. ఆయన మూర్ఖుడని వ్యాఖ్య!

currency notes showered : గుజరాత్‌లో రూ. 500 నోట్ల వర్షం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News