Telugu Flash News

Prabhas- Anushka: మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్‌- అనుష్క‌ల పెళ్లి.. సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంది?

prabhas anushka marriage

Prabhas- Anushka:టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుబ‌ల్ బ్యాచిల‌ర్స్ ప్రభాస్, అనుష్క వెండితెర‌పై ఎంతో చూడ ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అశేష సినీ లోకాన్నిమంత్ర ముగ్ధుల‌ని చేసింది. బాహుబలి సిరీస్ తో ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ కాగా, వీళ్లిద్దరి కెమిస్ట్రీ వావ్ అనేలా చేసింది.

అయితే వెండితెర‌పై తెగ సంద‌డి చేసిన ఈ జంట రియ‌ల్ లైఫ్‌లో కూడా ఒక‌టిగా మారితే బాగుంటుంద‌ని చాలా మంది త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. ఏదో రోజు పెళ్ళి పీఠలెక్కుతారని టాక్ కొన్ని నెల‌ల నుండి న‌డ‌స్తూనే ఉంది. వారిద్ద‌రు ఫ్రెండ్స్ అని చెప్పిన రూమ‌ర్స్ ఆగడం లేదు.

ప్ర‌భాస్- అనుష్క పెళ్లి వార్త‌లో నిజ‌మెంత‌?

ప్ర‌భాస్- అనుష్క పెళ్లి గురించిన వార్త‌లు ఇటీవ‌ల కాస్త సైలెంట్ కాగా, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. కృష్ణంరాజు హస్పిటల్ లో ఉన్న సమయంలో ప్రభాస్ , అనుష్క ఒకే సారి ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. దీంతో వీరిద్ద‌రు క‌లిసి ఉంటున్నార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కృష్ణం రాజు మృతిపై అనుష్క శెట్టి పెట్టిన పోస్ట్., అందరినీ కదిలిస్తోంది. కృష్ణరాజు అనుష్కను ప్రేమగా హత్తుకున్నపోటోను షేర్ చేస్తూ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. పెద్ద మనసు ఉన్న కృష్ణంరాజు గారు నిజమైన లెజెండ్.. మా గుండెల్లో ఎప్పటికీ మీరు కొలువై ఉంటారు.. అంటూ చాలా ఎమోష‌న‌ల్‌గా కామెంట్ చేసింది.

కృష్ణం రాజు.. అనుష్క‌ని త‌మ ఇంటి కోడ‌లిగా చేసుకోవాల‌ని భావించాడ‌ని కూడా అప్ప‌ట్లో పుకార్లు షికారు చేశాయి. కృష్ణం రాజు ఇంట్లో జ‌రిగిన ప‌లు ఈవెంట్స్ లో అనుష్క త‌ప్ప‌క పాల్గొంటుంది. దీంతో చాలా మంది అనుష్క‌- ప్ర‌భాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారంటూ కూడా ప్ర‌చారం న‌డుస్తుంది.

మరిన్ని వార్తలు చదవండి :

Sreemukhi: రోజు రోజుకి పెరిగిపోతున్న శ్రీముఖి క్రేజ్.. సైమా కోసం అంత డిమాండ్ చేసిందా?

Pranitha Subhash: పెళ్లి త‌ర్వాత తొలిసారి బికినీలో క‌నిపించి షాక్ ఇచ్చిన ప్ర‌ణీత‌

Samantha: కోట్లు సంపాదిస్తున్న స‌మంత ఆ డ‌బ్బుల‌ని వేటికి ఎక్కువ ఉప‌యోగిస్తుందో తెలుసా?

 

Exit mobile version