పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) మరోసారి వార్తల్లో నిలిచారు. స్వలింగ సంపర్కులపై పోప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు.. పాపం మాత్రమేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తప్పు పట్టారు. ఇలాంటి చట్టాలకు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. దీంతో ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది.
తన పిల్లలందరినీ దేవుడు సమానంగా చూస్తాడని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఎలాంటి షరతులు కూడా విధించడని చెప్పారు. ఇటీవల అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలకు మద్దతు ఇస్తున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ఈ విషయం తనకు తెలుసన్నారు.
స్వలింగ సంపర్కులు కూడా మనుషులేనని, వారిపై కఠినంగా వ్యవహరించొద్దని సూచించారు. మృదువుగా వ్యవహరించాలని, వారిని కూడా చర్చిలోకి అనుమతించాలని సూచించారు. ఈ విధానాన్ని పాటించాలని, వారిని స్వాగతించాలని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అగౌరవపరిచేలా వివక్ష చూపొద్దని సూచించారు.
నేరం కాదు.. పాపం
also read :
Viral Video Today : రోడ్డుపై బుల్లెట్ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో
Tollywood News : చిరంజీవి, బాలకృష్ణల భార్యలలో ఈ కామన్ పాయింట్ గుర్తించారా..!
Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?